వేంసూరు మండలం శంభునిగూడెంలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దిమ్మె వద్ద ఎమ్మెల్యే మట్టా రాగమయి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.