కల్లూరు: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

79చూసినవారు
కల్లూరు మండలం లోకవరం ఎన్ఎస్పీ సాగర్ కాలువలో ఆదివారం యువకుడు గల్లంతయిన విషయం తెలిసిందే. గల్లంతైన పరిమి శివ (19) మృతదేహం మంగళవారం లభ్యమైంది. రెండు రోజులుగా అధికారులు జాలర్లు, ఈతగాళ్లతో గాలిస్తున్న ఆచూకీ దొరకలేదు. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే మృతదేహం చెట్ల పొదల్లో ఇరుక్కుని నీటిపై తేలియాడుతూ కనిపించింది. మృతుడు కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్