ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం తగదని, ఇకనైనా పెండింగ్ లో ఉన్న డీఏలు, బిల్లులు, పీఆర్సీ ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. కల్లూరులోని ప్రభుత్వ కళాశాలలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రెండు డీఏలు, ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని ప్రకటించి విస్మరించారని పేర్కోన్నారు.