లంకసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే

63చూసినవారు
లంకసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే
పెనుబల్లి మండలం లంకసాగర్ ప్రాజెక్టుకు అధిక వరద నీరు చేరడంతో అక్కడ పరిస్థితులను ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. నీటిని విడుదల చేసేటప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో నీటిపారుదల శాఖ అధికారులు, ఎమ్మార్వో, పోలీస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్