రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు గురువారం అన్నారు. తల్లాడలోని ప్రైవేట్, మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఆధ్వర్యంలో పరిశీలించారు. కొనుగోలు దారులు రైతులకిస్తున్న ధరలను పరిశీలించారు. తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయకపోవడంతో పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యాపారులు రూ. 5, 500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు.