గణనాథుడిని దర్శించుకున్న వద్దిరాజు, సండ్ర

54చూసినవారు
గణనాథుడిని దర్శించుకున్న వద్దిరాజు, సండ్ర
హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఆదివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వద్దిరాజు, సండ్రకు కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారి సన్నిహితులు ముద్దు వినోద్, సుధీర్ కుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్