వేంసూరు: తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

70చూసినవారు
వేంసూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్