నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన వేంసూర్ రైతులు

667చూసినవారు
నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన వేంసూర్ రైతులు
వేంసూరు మండలంలోని పలు గ్రామాల రైతులు నాగార్జునా సీడ్స్ 1224 నకిలీ వరివిత్తనాల వలన తీవ్రంగా నష్టపోయన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మందలపు శ్రీనివాసరెడ్ఢి ఆద్వర్యంలో వేంసూరు మండల ఆఫీసు ముందు రెైతులతో కలిసి గురువారం నుండి దీక్ష చేపట్టినారు. ఈ సందర్బంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..వరి పంట 125 రోజులకు కూడ పూర్తిగా కంకులు కొన్నివచ్చి కొన్ని పోట్టదశలో ఉండటంవలన సకాలంలో కోతకోసి పంటపూర్తిగా రైతు చేతికి వచ్చే పరిస్ఠితిలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటకట్టి డీలర్స్ సోమ్ము చేసుకున్నారని రైతులను నిండా ముంచారని ఆయన అన్నారు. కాబట్టి రెైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన ఖర్చురాక, అప్పులపాలై ఆరుకాలం పండించేపంట పూర్తిగాచేతికిరాక దిగులుతో బోరున విలపిస్తున్నారని, ఈ ఆవేదనతో రైతులు మనేదుల పాలుకావాల్సి వచ్చిందని చెప్పారు.

కాబట్టి నకిలీ విత్తనాలు సరఫరా చేసిన నాగార్జున సీడ్స్ కంపెనీ యజమానులు పైన, వాటిని రైతులకు విక్రయించిన సంబంధిత డీలర్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసకోని రైతులకు పూర్తి నష్టపరిహరం ఇప్పించాలని వేంసూరు మండల రైతుల తరుపు మండలకాంగ్రేస్ పార్టీ నాయకులు మందలపు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. అనంతరం మండల తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్