వేంసూరు: దేవాలయ సొమ్మును స్వాధీనం చేసిన పోలీస్ అధికారులు
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలో వెంకమ్మ తల్లి గుడిలో జరిగిన దొంగతనం సంబంధించిన దొంగలను దొంగిలించిన సొత్తును స్వాధీనపరచుకొని సత్తుపల్లి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ విషయంపై కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు, సత్తుపల్లి ఏసీపి కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విషయాలను వెల్లడించారు.