
సత్తుపల్లి: హామాలీల రేట్ల ఒప్పందాన్ని అమలు పర్చాలి
సివిల్ సప్లై హమాలీల రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ హమాలీ కార్మికులు రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సత్తుపల్లి సివిల్ సప్లై గోదాం వద్ద హమాలీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం గోదాం ఇన్చార్జి మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు. ఎగుమతి, దిగుమతి రేట్ల ఒప్పందం ప్రకారం హమాలీలకు చెల్లింపులు చేయాలని కోరారు.