తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశానికి సమీపంలో ఓ వ్యక్తి రెండు చేతులు ఉన్నప్పటికీ వికలాంగుడిగా నటిస్తూ భిక్షాటన చేస్తూ కనిపించాడు. రెండు చేతులను చొక్కా లోపల దాచుకుని భిక్షాటన చేస్తున్నాడు. అతని ముందున్న డబ్బాలో ఎవరైనా డబ్బులు వేయగానే.. ఎవరూ లేని సమయం చూసి, తీసుకుని చొక్కా జేబులో వేసుకుంటున్నాడు. అబ్దుల్ సలామ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫన్నీ వీడియోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.