రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరుదైన కొరియన్ జాతి శునకాలను కిమ్ జాంగ్ ఉన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్యోంగ్‌యాంగ్‌లో చర్చలు జరిగిన సమయంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు పలు రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. పుతిన్ రెండు ఆసియా దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక, భద్రతా, రాజకీయ అంశాలపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఫుంగ్‌సన్ జాతికి చెందిన శునకాలను పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారు.