స్వలింగ సంపర్కుల వివాహాలకు ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతేడాది అక్టోబరులో ఏకగ్రీవంగా నిరాకరించింది. అయితే, ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ మరోసారి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తీర్పులో ఎటువంటి తప్పు కనిపించడం లేదని, అందువల్ల ఎటువంటి జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు వెల్లడించింది.