రెండో క్వాలిఫయర్‌లో తలపడుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది. అయితే ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని చాలా తక్కువ పరుగులకు కట్టడి చేశారు. పృథ్వీ షా(18) పరుగులతో మంచి ఊపులో ఉన్నప్పుడు చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతూ, పరుగులు సాధించడంలో వెనుకపడ్డారు. ధావన్ (36) ఒక్కడే అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. స్టోయినిస్ 18, రిషబ్ పంత్ 6, హెట్ మెయిర్ 17 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ అయ్యర్ 24, అక్షర్ పటేల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివం మావి, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు. రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3-2తో ఆధిక్యం సంపాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 29 సార్లు ఐపీఎల్‌లో తలపడతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 15 మ్యాచ్‌లు గెలిచింది. 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.