ఈ నెల 25 నుండి 28 వరకు సీపీఎం పార్టీ రాష్ట 4వ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల వాల్ పోస్టర్లను సీపీఎం కార్యాలయంలో శనివారం కొమురం భీం జిల్లా నాయకులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రాష్ట నాయకులు బండారు రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రజ సమస్యల పై సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని, అదే సందర్భంలో జిల్లాలో కూడా అనేక ప్రజా సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతుందని అన్నారు.