కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నూతన సంవత్సర 2025 ప్రముఖ పత్రిక క్యాలెండర్ ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దాగి ఉన్న నిజాలను నిర్భయంగా బయటకు ప్రచురించేదే పత్రిక అన్నారు. ఈ ఆవిష్కరణలో పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గాంధర్ల సాయిబాబా, పద్మ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.