కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం విద్యార్థులు ధర్నా చేపట్టారు. కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, అలాగే ప్రొఫెసర్లను నియమించాలని విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రొఫెసర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. వారికి బీసీ సంఘం నాయకులు ప్రణయ్ మద్దతు తెలిపారు.