వివాహానికి నిత్యావసర సరకులు అందజేసిన దివ్యశ్రీ ఫౌండేషన్

555చూసినవారు
వివాహానికి నిత్యావసర సరకులు అందజేసిన దివ్యశ్రీ ఫౌండేషన్
కుల, మతాలకు తావు లేకుండా సబ్బండా వర్గాలకు సేవ చేయడమే దివ్యశ్రీ ఫౌండేషన్ లక్ష్యం అని చైర్మన్ ధరవత్ ప్రవీణ్ నాయక్ అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం గదిగూడ మండల కేంద్రంలోని అర్జునీ జంగూగూడ గ్రామానికి చెందిన దంపతులు కొడప కట్టు కొడప రాంబాయి కుమారుడు కొడప అయ్యు వివాహానికి చైర్మన్ ప్రవీణ్ నాయక్ సహకారంతో గదిగూడ ఫౌండేషన్ సామజిక సేవకులు బుధవారం 150 కేజీల బియ్యం, 20 కేజీల కంది పప్పు, 15 లీటర్ల మంచి నూనె అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేద వారికీ సహాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉంటుందన్నారు. ఎవరైనా దాతలుంటే ముందుకు వచ్చి ఈ వివాహానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కుల, మత లకు చోటు లేకుండా అన్ని వర్గాల వారికీ సేవ చేయడమే దివ్య శ్రీ ఫౌండేషన్ లక్ష్యమాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూసం సురేష్, ఎంపీటీసీ ఉమ్రి మధు, కాను మెస్రం, చిన్ను, గ్రామ పెద్దలు మాడవి లచ్చు పటేల్, మాడవి రాము, దివ్యశ్రీ ఫౌండేషన్ సామాజిక సేవకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్