గదిగుడా మండలం ఖండో రాంపూర్ గ్రామం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సెడం వామన్ సోదరి కూతురు హార్దిక కొన్ని సంవత్సరాల నుండి సికిల్ సెల్ అనీమియా వ్యాధి తో బాధపడుతుంది. ఇట్టి విషయమును తెలుసుకున్న ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ గణేష్ రాథోడ్ వారి శ్రీ గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల నందు చికిత్స కొరకు చేర్చుకొని ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఆమె ఆరోగ్యం కుదుట పడిన తరువాత మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఇటువంటి నాయకులు సమాజ చేవ చేయడానికి కావాలి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.