గత నెలలో వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుకున్న శైలజ అనే విద్యార్థిని ఫుడ్ పాయిజన్ తో మృతి చెందగా సోమవారం ఎమ్మెల్సీ కవిత శైలజ సొంత గ్రామమైన సవాతి దాబా గ్రామంలోనీ విద్యార్థిని తల్లిదండ్రులను ఇంటికి వెళ్లి పరామర్శించారు. శైలజ ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం, శైలజ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కులు అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.