నార్నూర్ మండల కేంద్రానికి చెందిన జాదవ్ కైలాష్ వందన దంపతుల కుమార్తె వివాహ నిశ్చితార్ధ శుభాకార్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాబోయే వధువరులు మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ సురేష్ ఆడే, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, యశ్వంత్ రావ్ చౌహన్, రాథోడ్ సుభాష్, మోహన్ రాథోడ్, భారత్, అవినాష్ ఆడే పాల్గొన్నారు.