టీచ్ ఇన్ ఆసిఫాబాద్ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లిలో ర్యాలీ

394చూసినవారు
టీచ్ ఇన్ ఆసిఫాబాద్ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లిలో ర్యాలీ
లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ శ్రీ వరుణ్ రెడ్డి రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం "టీచ్ ఇన్ ఆసిఫాబాద్" కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున కొత్తపల్లి గ్రామపంచాయతిలో ఎంపీపీఎస్ పాఠశాల పిల్లలతో కలసి టీచ్ ఇన్ ఆసిఫాబాద్ ప్రత్యేక బృందం, లింగాపూర్ మండల ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్న పిల్లలు ఎండకి తిరగకుండా వారికీ నాణ్యమైన చదువు, ఆటలు, పాటలు, స్కిల్ డెవోలోప్మెంట్ తో పాటు అడవుల సంరక్షణ, శుభ్రతా, స్వచ్ఛ భారత్, నైతిక విలువలు పెంచే విధంగా అలాగే కొన్ని గొప్ప గొప్ప అంశాలను విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్యేశం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఆడే సవిత ప్రేమ్, వైస్ ఎంపీపీ ఆడే ఆత్మరామ్, కో -ఆప్షన్ సభ్యుడు షేక్ సలీమ్, స్థానిక సర్పంచ్ రాథోడ్ లక్ష్మి ఉద్దవ్, రెవిన్యూ డీటీ చిత్రు , ఎం .ఈ.ఓ సుధాకర్, ఆర్వీఎం జేఈ శశి, మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్, మండల సోషల్ మీడియా కన్వినర్ జాటోత్ రాహుల్, పాఠశాల సిబ్బంది, టీచ్ ఇన్ ఆసిఫాబాద్ బృందం, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్