ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో కేజీబీవీలో ఉపాధ్యాయులు లేక విద్య వ్యవస్థ కుంటుబడిపోతుంది. కేజీబీవీ లలో ఉపాధ్యాయుల నియమాకాలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కు మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే కేజీబీవీ హాస్టల్లో ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపడతామని వారు అన్నారు.