అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రెహమాన్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

1173చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి  రెహమాన్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
లింగాపూర్: రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షైక్ అబ్దుల్ రెహమాన్ జిలాని మరోసారి మానవత్వం చాటుకున్నారు. కొమురం భీమ్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ (గోండ్గూడ) గ్రామానికి చెందిన జుగ్నాక జీవన్ (40) అనే నిరుపేద రైతు నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్య0 కారణంగా జీవనోపాధికి దూరం అయ్యారు. వీరికి భార్య, 10 సంవత్సరాల లోపు ఒక చిన్న బాబును పోషించే బాధ్యత ఉంది. ఆర్థికంగా నిస్సహయులైన వారి కుటుంబానికి తన కష్టంలో భరోసాగా నిలవాలనే సామాజిక సేవా భావంతో శుక్రవారం రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షైక్ అబ్దుల్ జిలాని సహకారంతో రూ. 5000 లను పెద్దల సమక్షంలో అందజేశారు. రెహమాన్ ఫౌండేషన్ వారి మంచి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని ఈ మధ్య కాలంలో కొత్త దాతలు ముందుకు వచ్చి తమ విరాళాలు వారి సంస్థ ద్వారా లబ్దిదారులకు అందచేయడం శుభ పరిణామమని, ఇది రెహమాన్ టీమ్ సభ్యులను మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సాహ పరుస్తు0దని సభ్యులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు షేక్ రఫిక్, మెస్రం దేవ్జి, వత్తె మహాదు, జాటోత్ దవిత్ కుమార్, జాధవ్ వీలాష్, షేక్ కాశిం, చప్డే మారుతి, ఎల్లాపటార్ సర్పంచ్ వేర్కాడ దత్తు, దేవ్కతే దత్తు, కోచ్చాడ గణేష్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్