కొమురంభీం ప్రాజెక్టు జలాశయంలోకి ఆదివారం వరద నీరు చేరుతుండటంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 243 మీటర్లకు గాను 237. 900 మీటర్లకు చేరింది. ఎగువ కురుస్తున్న వానలతో 3, 258 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుండగా, నాలుగు, అయిదు, ఆరు గేట్లను 0. 50 మీటర్ల చొప్పున ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.