టీపీయూఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డీఈవో

276చూసినవారు
టీపీయూఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డీఈవో
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ డైరీ, క్యాలెండర్లను జిల్లా విద్యాశాఖాధికారి పి.అశోక్ శనివారం ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తపస్ నాయకులు డిఈవోను మర్యాదపూర్వకంగా కలిసి నూతన జిల్లా శాఖ సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ బదిలీలు పదోన్నతుల మార్గదర్శకాలను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 317 జీవో వలన స్థానికేతర్లుగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దానికోసం జీరో సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు కూడా బదిలీల్లో అవకాశం ఇవ్వాలని కోరారు ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఈ బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు బండారి పోశం మాట్లాడుతూ గతంలో బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అకాడమిక్ సెల్ కో కన్వీనర్ విద్యాసాగర్, జిల్లా గౌరవాధ్యక్షులు తాటి రవీందర్, జిల్లా గౌరవ సలహాదారు, ప్రభోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోక గోమంత్ రెడ్డి, జిల్లా నాయకు శివరామకృష్ణ, సురేష్, తిరుమల, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్