కాగజ్‌నగర్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళావరం నాగుపాము హల్చల్ చేసింది. ఒక్కసారిగా పామును చూసి కార్యాలయ సిబ్బంది బయటికి పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ సాయి వచ్చి పామును పట్టి తీసుకెళ్లి అడవిలో వదిపిపెట్టారు. దీంతో సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. ఈ కార్యాలయం అటవీప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరుచుగా పాములు వస్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు.