డిజిల్ లేక రోడ్డుపై నిలిచిన కంకర లారీ

52చూసినవారు
చింతలమానేపల్లి మండలంలోని కర్జవెళ్లి గ్రామ సమీపంలో ముత్తంపేట్ గ్రామం క్రేసర్ నుంచి కంకర లారీ అధిక లోడుతో గూడెం వైపు వెళ్తున్న క్రమంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో డిజిల్ లేకపోవడంతో కంకర లారీ రోడ్ మధ్యలో ఆగిపోయింది. అయితే రెండు వైపులా నుంచి ఎక్కడి వాహనాలు అక్కడే మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉన్నాయి. గురువారం ఉదయం మూడు ఆర్టీసి బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్