కాగజ్‌నగర్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో బాగంగా బుధవారం మొదటి రోజు అచ్చలాపూర్ వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాద్యాల నడుమ వేద స్వస్తి వచనములతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనము, యాగశాల ప్రవేశం, అఖండ దీప ప్రజ్వలన, స్థాపన, నవగ్రహ, చతుర్వేద సేవలు "హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు తెలియజేసారు.