బాదిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

1555చూసినవారు
కాగజ్ నగర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన మందాడే రాజన్న ఇల్లు రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కాలి బూడిదయింది. ఆదివారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాలిబూడిదైన ఇంటిని పరిశీలించి, రాజన్న కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందే విధంగా చూడాలని స్థానిక ఎమ్మార్వోకు తెలిపారు. కోట గుండయ్య, గౌత్రే గణపతి, ఠాక్రే వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్