కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న మహేందర్ కు ఉత్తమ సేవలకు పురస్కారం దక్కింది. పోలీసు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు తనదైన శైలిలో సేవలందిస్తుండటంతో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొమురంభీం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఎస్సై మహేందర్, ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంశా పత్రాన్ని అందుకున్నారు.