మణిపూర్లో మరో మహిళను కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఇటీవల ఓ గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను చంపిన ఘటన మరవక ముందే శనివారం బిష్ణుపూర్ జిల్లాలో మరో మహిళను కాల్చి చంపడంతో ఉద్రిక్తత నెలకొంది. మైతీ కమ్యూనిటీకి చెందిన జోసాంగ్కిమ్ హ్మార్ అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి పొలంలో పని చేస్తుండగా కాల్పులు జరిపి చంపేశారు. ఇరు వర్గాల ఎమ్మెల్యేలతో కేంద్రం భేటీ అయినప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదు.