వాంకిడి: అతిపిన్న వయసులో రాజకీయ నాయకుడిగా యువకుడు
వాంకిడి మండలం అర్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు చంద్రశేఖర్ అతిపిన్న (21) వయసులోనే రాజకీయాల్లో వచ్చానని మీడియాతో శుక్రవారం పంచుకున్నారు. గ్రామ వార్డు మెంబర్, గ్రామ పటేల్ నుంచి ఇప్పుడు బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జిగా రాజకీయాల్లో 5 ఏళ్లుగా రాణిస్తున్నానన్నారు. ప్రస్తుతం తన వయసు (26) అన్నారు. యుక్త వయసులో ఎంజాయ్ చేయాల్సిన యువకుడు ప్రజా నాయకుడిగా అతిపిన్న వయసులో ఎదగడం పలువురు అభినందిస్తున్నారు.