52 వారాల కనిష్ఠానికి కోటక్ షేర్లు

58చూసినవారు
52 వారాల కనిష్ఠానికి కోటక్ షేర్లు
ప్రైవేటు రంగ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు గురువారం భారీగా కుంగాయి. కంపెనీ జాయింట్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎస్‌ మణియన్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలగడమే ఇందుకు కారణం. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా కొత్త కస్టమర్లు చేర్చుకోవడం, క్రెడిట్‌ కార్డుల జారీపై ఆర్‌బీఐ ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో కోటక్‌ షేరు ఓ దశలో 4 శాతం మేర క్షీణించి 52 వారాల కనిష్ఠానికి చేరింది. చివరికి బీఎస్‌ఈలో 2.78 శాతం నష్టంతో 1578.65 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్