తిరుమలకుంటలో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం..

77చూసినవారు
తిరుమలకుంటలో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం..
అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో బొడ్రాయి రెండవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం ప్రారంభమైన వార్షికోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. మహిళలు, గ్రామస్తులు కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బోనాలను పసుపు కుంకులతో అలంకరించి, నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల్లతో ఊరేంపుగా వెళ్లి గ్రామదేవతకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్