దమ్మపేట మండలం జగ్గారం, అంకంపాలెం, గండుగులపల్లి పట్వారిగూడెం గ్రామపంచాయతీల పరిధిలో పలు గ్రామాలలో వివిధ చర్చిలలో బుధవారం జరుగుతున్న మేరీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పార్ధనలలో పాల్గొన్నారు. మేరీ క్రిస్మస్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్వమానవాళికి శాంతి సందేశమిచ్చిన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ముందుగా క్రైస్తవ సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు.