సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి వేడుకలు

1347చూసినవారు
సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి వేడుకలు
త్యాగం, పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరు గడించిన సామాజిక సేవా మూర్తి సావిత్రిబాయి పూలే అని ఐద్వా చర్ల మండల కమిటీ కొనియాడింది. బుధవారం సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతిని పురస్కరించుకొని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు అలవాల రాజమ్మ అధ్యక్షతన చర్లలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు పొడుపు గంటి సమ్మక్క మాట్లాడుతూ.. స్త్రీకి సముచిత స్థానం కావాలని పోరాడిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. పీడిత ప్రజల విద్య కోసం ఆమె అహర్నిశలు శ్రమించారని, సమాజంలో కులతత్వ పురుషాధిక్యత అధికంగా ఉన్న రోజుల్లోనే మహిళల అభ్యుదయానికి ఆమె కృషి చేశారన్నారు. నేడు మహిళలు అన్ని రంగాలలో అంటే ఆనాడు సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాల ఫలితమే అని ఆమె పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సభ్యులు వరమ్మ, శిరోని, సూరమ్మ, దుర్గా భవాని, సిరి, నిరోషా తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్