తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీంద్ర నాయక్ శనివారం భద్రాచలంలో పర్యటించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుతున్న వైద్యంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరు, హాజరు శాతాన్ని పరీక్షించి పలు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు సేవలు అందించాలన్నారు.