నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి
పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామం పరిధిలోని తాలిపేరు నదిలో శనివారం స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు. మృతులు చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గట్టుపల్లి జంపన్న (23), సోయంలచ్చి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.