భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సరిహద్దులోని చత్తీశ్ ఘఢ్ కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి దుబ్బమార్క వద్ద నక్సలైట్లు అమర్చిన ఐఈడి బాంబు పేలి సోమవారం ఓ ఆదివాసి మహిళ మృతి చెందింది. కవాసి సుక్కీ అనే ఆదివాసీ మహిళ రోజు మాదిరిగానే తన పశువులను మేపడానికి తన గ్రామం నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఐఈడి పై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనపై కిష్టారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.