చర్ల మండల పరిధిలోని కలివేరు, ఆర్ కొత్తగూడెం గ్రామాలలో శుక్రవారం మావోయిస్టుల పోస్టర్లు వెలిసాయి. జూలై 28 నుండి ఆగస్టు 3వ తారీకు వరకు గ్రామ గ్రామాన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలని, ప్రజలపై, మావోయిస్టు పార్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దోపిడీ వర్గాలకు సేవ చేస్తూ ప్రజా సంక్షేమాన్ని మరిచిన బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నారు.