పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులను కాకతీయ యూనివర్సిటీ, డీన్ సిడిసి, వి. రామచంద్రన్ చేతులమీదుగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి పద్మాకు మంగళవారం అందించారు. పాల్వంచ డిగ్రీ కాలేజీ అనతి కాలంలోనే నాక్ ఏ గ్రేడ్ సాధించి నవంబర్ 13న యూజీసీ నుంచి అటానమస్ హోదాను పొందడం జరిగిందని రామచంద్రన్ అన్నారు.