బూర్గంపాడు మండలం సారపాకలో ఆదివారం ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు సమావేశం నిర్వహించారు. ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు సోమిరెడ్డి, ఎస్ కే పాషా అన్నారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 5న అన్ని షిఫ్టుల్లో నిరసనలు తెలియజేయాలని పేర్కొన్నారు.