ఈనెల 9న జరిగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ సదస్సును జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు సంజీవరావు కోరారు. మంగళవారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్లు హరగోపాల్, ఖాసీం, గడ్డం లక్ష్మణ్, కాత్యాయని విద్మహే, వీక్షణం వేణుగోపాల్, పాల్గొంటారని అన్నారు.