భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రజిని కుమారి తెలిపారు.