అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి ఎల్ఓసి చెక్కు అందజేత
ములకలపల్లి మండలం మంగపేట గ్రామానికి చెందిన V. నాగరాజు రెండవ కుమారుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక నాయకులు ద్వారా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆర్ధిక పరిస్థితి గమనించి కృష్ణ స్వామికి వైద్యం నిమిత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు అవసరం అవ్వగా వెంటనే ఎల్ఓసీ మంజూరు చేసి శుక్రవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ చెక్కును అందించారు.