కొత్తగూడెం: సర్వే వివరాల నిక్షిప్తంపై కలెక్టర్ దిశా నిర్దేశం

80చూసినవారు
కొత్తగూడెం: సర్వే వివరాల నిక్షిప్తంపై కలెక్టర్ దిశా నిర్దేశం
కుటుంబ సర్వే వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్ చేయాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న చేపట్టిన సర్వే జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. సేకరించిన వివరాలను వెంటనే ఆన్లైన్లో నిక్షిప్తపరచాలని చెప్పారు. ఈప్రక్రియను సూపర్వైజర్లు, ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్