భద్రాచలం పట్టణంలోని పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఆసుపత్రుల సమస్యలపై గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి కెచ్చల కల్పన, డివిజన్ అధ్యక్షురాలు మునిగేలా మహేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి సాయన్న, కుమారి, మైమదా, కృష్ణవేణి, షకీరా, శాంత పాల్గొన్నారు.