ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ స్కూల్ భవనాలను అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి గతంలో వచ్చిన సందర్భంలో పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా శుక్రవారం పనుల జాప్యం అసంపూర్తి నిర్మాణాలను చూసి కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.