ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

76చూసినవారు
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
బూర్గంపాడు మండలం సారపాకలోని పంచాయతీ కార్యాలయం వీధికి చెందిన అమరజీవి(35)తన భార్య నాగమల్లేశ్వరితో గురువారం రాత్రి జీతం విషయంలో గొడవ పడ్డారు. ఈక్రమంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం తన భార్య వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ సుమన్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్